‘కల్కి’ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ క్యాన్సిల్?

కటౌట్ ఉన్నోడికి ప్రచారంతో పనిలేదు. ‘సలార్’ విషయంలో ఇదే ఫాలో అయ్యారు మేకర్స్. సినిమా విడుదలకు ముందు కేవలం ఒకే ఒక్క ఇంటర్యూ ఇచ్చారు. అంతేకానీ.. ఎలాంటి ప్రి-రిలీజ్ హడావుడిలు లేవు. నార్త్ లో పబ్లిసిటీ అస్సలే లేదు. అయినా.. ప్రభాస్ మేనియాతో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక.. ఇప్పుడు ‘కల్కి’ విషయంలో కాస్త ముందు నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే బుజ్జి పరిచయ వేదిక అంటూ ఒక వేడుకను, ముంబైలో అగ్ర తారలతో మరొక వేడుకను నిర్వహించారు.

ఇక.. తెలుగు రాష్ట్రాలలో రెబెల్ ఫ్యాన్స్ కోసం భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అమరావతి వేదికగా ‘కల్కి’ ప్రి రిలీజ్ ఉండబోతుందనే న్యూస్ వచ్చింది. అయితే.. ఇప్పుడు ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందనేది లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరోవైపు ఈరోజు (జూన్ 21) సాయంత్రం ‘కల్కి’ నుంచి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే లీక్ అయిన ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ వచ్చింది. జూన్ 27న ‘కల్కి’ పలు భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts