ఈ ఫ్రైడే టాలీవుడ్ లో పాంచ్ పటాకా

ఫ్రైడే వచ్చిందంటే చాలు.. థియేటర్స్ అన్నీ కొత్త సినిమా పోస్టర్స్ తో కళకళలాడుతుంటాయి. అయితే ఆ కళ మొదటి ఆటకే వెలవెలబోతోందీ మధ్య. పెద్ద సినిమాలేవీ లేవు. చిన్ని సినమాలు ఆకట్టుకోవు. దీంతో ఆడియన్స్ కూడా ఫ్రైడేస్ ను డ్రై డేస్ గా భావిస్తున్నారు. అందుకే థియేటర్స్ అన్నీ కళ తప్పి కనిపిస్తున్నాయి. అలాగని విడుదలయ్యే సినిమాలు ఆగవు కదా..?

గత వారం ఇచ్చిన చిత్రాల్లో సామజవరగమనా సత్తా చాటింది. ఈ వీక్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఐదు సినిమాలు రాబోతున్నాయి. ఇంకా కొన్ని ఉండొచ్చు. బట్ ఆడియన్స్ లో కాస్త అటెన్షన్ తెచ్చుకున్నవి మాత్రం ఈ ఐదు సినిమాలే అనొచ్చు.


ఈ పాంచ్ పటాకాలో కాస్త ఎక్కవ అటెన్షన్ ఉన్న సినిమా నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి పవన్ దర్శకుడు.సత్య ఓ కీలకపాత్ర చేశాడు. ఈ మూవీ టీజర్ నుంచి ట్రైలర్ వరకూ హిలేరియస్ గా ఆకట్టుకున్నాయి. నాగ శౌర్య కూడా సూపర్ హిట్ కాదు.. కేవలం బ్లాక్ బస్టర్ మాత్రమే అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించి టాలీవుడ్ లో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. సో.. ఆ టాక్ నిజమైతే.. నాగశౌర్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ పడినట్టే అవుతుంది.


తర్వాత జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, ఆశిష్‌ గాంధీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రంగి సినిమా ఉంది. స్వాత్రంత్య్రం అనంతరం తెలంగాణ ప్రాంతంలో దొరల ఆడగాలకు నిదర్శనంగా రూపొందిన సినిమా అని చెబుతున్నారు. అజయ్ సమ్రాట్ డైరెక్షన్ లో తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకి