Varuntej lavanya : దాగుడు మూతల్లేవిక.. అఫీషియల్ గానే కలుస్తున్నారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి గురించి కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వచ్చాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడనీ.. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే న్యూస్ చక్కర్లు కొట్టాయి. చాలా వరకూ ఇండస్ట్రీలో ఇది నిజమే అని తెలిసినా.. జనరల్ ఆడియన్స్ మాత్రం రెగ్యులర్ రూమర్ అనుకున్నారు.

బట్ ఇది రూమర్ కాదు. నిజంగానే ఈ ఇద్దరూ ప్రేమవివాహం చేసుకోబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ గానే ప్రకటన వచ్చింది. రీసెంట్ గా వినిపించినట్టుగానే శుక్రవారం ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా హాజరవుతున్నారు. ఇక ఈ అఫీషియల్ న్యూస్ తో పాటు వచ్చిన కోట్ కూడా ఆకట్టుకుంటోంది. ” రెండు హృదయాలు ఒక ప్రేమ. ఇద్దరికీ జీవితాంతం ఆనందం ఉండాలి అని కోరుకుంటున్నాం” అని కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ లా ఉంది.


ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మొదటిసారిగా.. మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం పోయినా.. వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత అంతరిక్షం అనే చిత్రంలోనూ కలిసి నటించారు. అప్పటి నుంచీ వీరు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు ఉన్నాయి. బట్ ఎప్పుడూ ఇద్దరూ కలిసి బయట కనిపించలేదు. దీంతో చాలామంది మొదట్లో రూమరే అనుకున్నారు. మరోవైపు ఈ పెళ్లికి నాగబాబు కుటుంబంలో అభ్యంతరాలున్నాయి అనే వార్తలూ వచ్చాయి. మొత్తంగా అన్నిటినీ దాటుకుని ఈ రీల్ కపుల్.. రియల్ కపుల్ గా మారుతోంది. ఈ సందర్భంగా ఇద్దరికీ శుభాకాంక్షలు చెబుతోంది తెలుగు 70ఎమ్.ఎమ్.