‘విశ్వంభర‘కి విలన్ సెట్టయ్యాడు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర‘. తొలి చిత్రం ‘బింబిసార‘తోనే భారీ విజయాన్నందుకున్న వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘విశ్వంభర‘ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక.. లేటెస్ట్ గా ‘విశ్వంభర‘కి విలన్ ఫిక్సయ్యాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ నటించబోతున్నాడు. అతనికి వెల్కమ్ చెబుతూ మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి ప్రతినాయకుడిగా కునాల్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక.. తాను చిన్న వయసు నుంచే ఎంతగానో అభిమానించే చిరంజీవి గారితో నటించడం చాలా ఆనందంగా ఉందని కునాల్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

‘రంగ్ దే బసంతి‘ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కునాల్ కపూర్ కి.. ఆ తర్వాత ‘వెల్కమ్ టు సజ్జన్ పూర్, డాన్ 2, డియర్ జిందగీ‘ వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక.. తెలుగులోనూ నాగార్జున-నాని మూవీ ‘దేవదాస్‘లో నటించాడు కునాల్.

Related Posts