‘పుష్ప 2’ పాటల ప్రభంజనం మొదలవుతోంది..!

‘పుష్ప’ ఫ్రాంఛైజ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగ్ అయితే.. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది పాటల గురించి. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ అంటేనే పాటలు సూపర్ హిట్. ఇక.. అంతకుముందు వరకూ తెలుగుకే పరిమితమైన వీరి కాంబో ‘పుష్ప’తో పాన్ ఇండియా బాట పట్టింది. పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప’ పార్ట్ 1 లోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. పాన్ ఇండియా హిట్స్ అయిన ‘బాహుబలి, కె.జి.యఫ్’కి మించిన రీతిలో ‘పుష్ప 1’ ఆల్బమ్ హిట్ అయ్యిందని ఒప్పుకోక తప్పదు.

‘పుష్ప 1’ ఆల్బమ్ సూపర్ హిట్ ఇవ్వడంతో.. ‘పుష్ప 2’ ఆల్బమ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్ గా ‘పుష్ప 2’ మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టింది చిత్రబృందం. ఈరోజు (ఏప్రిల్ 24) ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే గీతానికి సంబంధించి ప్రోమో రిలీజ్ కాబోతుంది. సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ పాట ప్రోమో విడుదలవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చింది టీమ్.

Related Posts