ఫైనల్ గా హీరోయిన్ ను చూపించారు

అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందబోతోన్న చిత్రంలో హీరోయిన్ విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా బిగ్ కాన్వాస్ స్టోరీగా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని ముందు నుంచీ చెబుతున్నారు. ఆ వెయిట్ తమ నటనతో నిలబెట్టే హీరోయిన్ కోసం చూశారు.

మొదట చాలామంది కీర్తి సురేష్ చేస్తుందనుకున్నారు. బట్ ఫైనల్ గా ఈ వేట సాయి పల్లవి వద్ద ఆగింది. ఆల్రెడీ తను నటిస్తోన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ఓ వీడియోతో చెప్పింది మూవీ టీమ్. ఫైనల్ గా తన ఫేస్ ను రివీల్ చేస్తూ హీరో, దర్శకుడితో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ లు కూడా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కనిపించారు. సో.. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోందనేది అఫీషియల్ అయింది.


సాయి పల్లవి ఆల్రెడీ నాగ చైతన్యతో లవ్ స్టోరీ మూవీలో నటించింది. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీకి జనం ఫిదా అయ్యారు. ఇద్దరివీ స్ట్రాంగ్ రోల్స్. ఇద్దరూ పోటీ పడి మరీ నటించారు. విశేషం ఏంటంటే.. ఈ దర్శకుడితో కలిపి చైతన్యతో సాయి పల్లవి గతంలోనే నటించాల్సింది. యస్.. ఇంతకుముందు చైతన్యతో చందు మొండేటి తీసిన ప్రేమమ్ లో ముందుగా అనుకున్నది సాయి పల్లవినే. ఈ పాత్రను తను ఆల్రెడీ మళయాలంలో చేసింది. అక్కడ ప్రేమమ్ బ్లాక్ బస్టర్ కావడానికి సాయి పల్లవి చేసిన మలర్ పాత్ర మెయిన్ ఎసెట్ గా నిలిచింది. అందుకే తననే తెలుగులోనూ తీసుకోవాలనుకున్నారు. మరి అప్పుడేమైందో తను ఓకే చెప్పలేదు. చివరికి ఆ పాత్రను శ్రుతి హాసన్ చేసింది.


అప్పుడు మిస్ అయినా.. నాగ చైతన్య, చందు మొండేటితో ఇప్పుడు కలిసి వర్క్ చేయబోతోంది సాయి పల్లవి. ఇక ఈ చిత్రం శ్రీకాకుళంలోని కొందరు జాలర్ల నేపథ్యంలో అల్లుకున్నది అని ముందే చెప్పారు. ఆ జాలర్లు వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళతారు. పాకిస్తాన్ నేవీ అధికారులు వీరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అక్కడి నుంచి వీరు ఎలా విడుదలయ్యారు. ఈ క్రమంలో వారూ, వారి కుటుంబాలు ఎంత స్ట్రగుల్ అయ్యాయి అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతోంది. దానికి ముందు ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందట. మొత్తంగా ఈ మూవీకి సాయి పల్లవి ఎంట్రీతో మరింత వెయిట్ పెరుగుతుందనుకోవచ్చు.

Related Posts