తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కండిషన్స్

సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిలంభించారు. ఈనేపథ్యంలో.. తెలుగు చిత్ర పరిశ్రమకు కొన్ని కండిషన్స్ పెట్టారు.

ప్రతీ సినిమాకి ముందు సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై అవగానే కల్పించే వీడియోలో ప్రదర్శించాలన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు.. కానీ, వీటి పై అవగాహన కల్పించడం లేదు.. ఇకపై వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు.

డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమాకు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియో తో అవగానే కల్పించాలన్నారు. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని.. అలాంటి నిర్మాతలకు, డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు అని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి.

ఈ విషయంలో సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలి అన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లు లో ప్రసారం చేయక పోతే మీ థియేటర్లు కు అనుమతి లేదన్నారు. ఈ సందర్భంగా.. ఇటీవల తెలంగాణలో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ చిరంజీవి చేసిన వీడియోని ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. సినిమాలో ఉన్న వారితో 2 నిమిషాలు స‌మాజం కోసం ఓ వీడియో చేయాల్సిందే అని రేవంత్ రెడ్డి చెప్పారు.

Related Posts