తమిళ్ డైరెక్టర్ తో నాని

కొన్నాళ్లుగా తమిళ్ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కానీ ఎవరూ సాలిడ్ హిట్ ఇవ్వలేదు. దీంతో ఇదో సెంటిమెంట్ గానూ భావిస్తున్నారు. అయినా నేచురల్ స్టార్ నాని కూడా ఓ తమిళ్ డైరెక్టర్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది.ఈ మూవీతో శౌర్యు అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. నాని సినిమాతో ఎంటర్ అయ్యే డైరెక్టర్స్ మంచి పేరు తెచ్చుకుంటారనే టాక్ కూడా ఉంది.హాయ్ నాన్న తర్వాత ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకున్నాడు నాని. ఈ విషయంలో నాని ఎప్పుడూ ముందే ఉంటాడు.


తనతో అంటే సుందరానికి అనే సినిమా తీసిన వివేక్ ఆత్రేయకు మరో అవకాశం ఇచ్చాడు నాని. వివేక్ సినిమాల్లో ఓ వైవిధ్యం ఉంటుంది.సింపుల్ నెరేషన్ తో ఇంప్రస్ చేస్తాడు. అంటే సుందరానికి కూడా అంతే. కానీ ఎందుకో మిస్ ఫైర్ అయింది.బట్ అతని టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం. అందుకే నాని మళ్లీ అతనితో సినిమాకు ఓకే చెప్పాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.


వివేక్ తో పాటు తమిళ్ దర్శకుడు సిబి చక్రవర్తితో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు నాని. ఈ దర్శకుడు తమిళ్ లో డాన్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉన్నాడు. తన రెండో సినిమానే తెలుగులో చేస్తుండటం విశేషం. ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలూ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ఓ మంచి టైమ్ చూసి అనౌన్స్ చేయడమే కాక.. రెండు సినిమాలనూ ఒకేసారి సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు. అంటే నాని ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో ఒకేసారి పార్టిసిపేట్ చేస్తాడన్నమాట.

Related Posts