పెద్ద వివాదంలో చిక్కుకున్న తమన్నా

కంపెనీలకు మార్కెటింగ్ లో చాలా ముఖ్యమైనది సినీ తారలు. అందుకే.. తమ ప్రొడక్ట్స్ కి పలు దశాబ్దాలుగా.. సినీ స్టార్స్ ను ప్రచారకర్తలుగా ఉపయోగించుకుంటున్నారు. నటీనటులు కూడా ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు ఎండోర్స్ మెంట్స్ లో నటించడానికి పోటీపడుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. డబ్బులు గురించి ఆయా కంపెనీల విషయాలను ఏమాత్రం తెలుసుకోకుండా అడ్వర్‌టైజ్ మెంట్స్ చేస్తే చిక్కులు పడాల్సి వస్తోంది.

లేటెస్ట్ గా మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇలాంటి చిక్కులే ఎదురయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో వీక్షించాలని తమన్నా ప్రమోట్ చేసింది. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్‌ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్‌ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్‌’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా.. తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఫెయిర్‌ ప్లే యాప్‌పై గతంలోనూ మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ యాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నాతో పాటు.. సంజయ్‌ దత్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి నటులు కూడా ప్రచారం చేసింది. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్‌ దత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఇక.. ‘ఫెయిర్ ప్’యాప్ ను ప్రమోట్ చేయడానికి తమన్నాను ఎవరు సంప్రదించారు? ఎంత పేమెంట్ చేశారు? ఆ పేమెంట్స్ ఎలా జరిగాయి? వంటి విషయాలను తమన్నా నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు పోలీసులు.