HomeMoviesటాలీవుడ్రా ఆఫీసర్ గా టబు

రా ఆఫీసర్ గా టబు

-

సీనియర్ బ్యూటీ టబు.. ఏజ్ బార్ అయినా గ్లామర్ రోల్స్ తోనూ అదరగొడుతోంది.. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. బట్ తన తరం హీరోయిన్లలా ఖాళీగా మాత్రం లేదు. రెగ్యులర్ గా తనకు నచ్చిన కథలు వస్తే నటిస్తూనే ఉంది.తన కెరీర్ లో కొన్ని స్పెషల్ మూవీస్ లిస్ట్ తీస్తే విశాల్ భరద్వాజ్ తీసిన సినిమాలూ ఉంటాయి. అలాంటి డైరెక్టర్ తో మరోసారి తను ఖూఫీయా అనే సిరీస్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో రానున్న ఈ సీరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కు ముందే టాక్ ఆఫ్ ద బాలీవుడ్ గా ఉన్న ఈ సిరీస్ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ సీరిస్ లో టబు ఓ ‘రా’ఏజెంట్ గా నటించింది. ఇది అమర్ భూషణ్ రాసిన ‘ఎస్కేప్ టు నో వేర్’ అనే నవల ఆధారంగా రూపొందిన సిరీస్.


న్యూ ఢిల్లీలోని రా హెడ్ ఆఫీస్ లోని ఒక ఉద్యోగి దేశ భద్రతకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను జీరాక్స్ తీసి శతృదేశాలకు అందిస్తుంటాడు. తద్వారా అతనికి విపరీతమైన డబ్బు వస్తుంది. ఓ కుటుంబం కూడా ఉన్న అతని భార్య ఇంత డబ్బు ఎక్కడిది అని ప్రశ్నిస్తుంది. అంతే కాదు.. నువ్వు దేశాన్ని మోసం చేస్తున్నావా అంటే లేదని చెబుతాడు. అయితే అతను ఏ డాక్యుమెంట్స్ ను తీసుకున్నాడు. ఏ దేశాలకు మన రహస్యాలను అమ్మాడు. దీని వెనక ఉన్న మోటో ఏంటీ.. ? వీటి వల్ల మన దేశానికి వచ్చిన నష్టాలేంటీ అని విచారించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేయించే బాధ్యత కృష్ణ మెహ్రా అలియాస్ కేఎమ్ పై పడుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో తను ఎన్నో సంచలన విషయాలను వెలుగులోకి తెస్తుంది. అదే టైమ్ లో సదరు నిందితుడు భార్యను కాపాడేందుకూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదీ ట్రైలర్ లో కనిపించిన అంశాలు.


ట్రైలర్ గా కాస్త లైటర్ వే లోనూ.. కథ మొత్తం తెలిసినట్టుగానూ ఉన్నా.. ఇంకేదో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందని చివర్లో కొన్ని షాట్స్ ద్వారా చూపించాడు దర్శకుడు విశాల్ భరద్వాజ్. 2004లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సిరీస్ కాబట్టి.. ఈ ఉదంతాలకు సంబంధించిన అనేక అంశాలు అప్పటి ఆఫీసర్స్ కు అర్థం అవుతాయి. అలాగే ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది ఆడియన్స్ కు కూడా అద్భుతమైన ఫీల్ ఇవ్వబోతోందనిపిస్తోంది. అక్టోబర్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోన్న ఈ సిరీస్ లో టబుతో పాటు అలీ ఫజల్, వామికా గబ్బి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఇవీ చదవండి

English News