దేవరలో సర్ ప్రైజింగ్ ఫైట్.. ఊహలకూ అందదట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వస్తోన్న దేవర సినిమా గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. అయితే ఇవన్నీ రూమర్స్ కాకపోవడమే విశేషం. అందుకే ఇతర హీరోల అభిమానులు కూడా దేవరలాగా వారి హీరోల సినిమా అప్డేట్స్ ఇవ్వాలని పట్టు పడుతున్నారు. సినిమా ఎక్కువగా సముద్రం నేపథ్యంలో సాగుతుంది. అంటే విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. అందుకే ముందుగా యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ అయిన షెడ్యూల్స్ కేవలం ఫైట్స్ ను మాత్రమే చిత్రీకరించారు.

ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లో కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్ నే తరకెక్కిస్తున్నారు. మామూలుగా సముద్రంలో జరిగే ఎపిసోడ్స్ కు విఎఫ్ఎక్స్ ఎక్కువ అవసరం. అందుకే ముందు ఫైట్స్ తీస్తే పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ దొరుకుతుంది. అప్పుడు అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నుంచి టాకీ స్టార్ట్ చేసి డిసెంబర్ వరకూ పాటలతో సహా మొత్తం షూటింగ్ ఫినిష్ చేయాలనే టార్గెట్ తో దూసుకుపోతోంది దేవర టీమ్. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి వినిపిస్తోన్న ఓవార్త వింటే ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. జనరల్ ఆడియన్స్ కు కూడా పూనకం వస్తుంది.


విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దేవర సినిమాలో “షార్క్” తో ఓ ఫైట్ ఉంటుందట. యస్.. సముద్రంలో భారీ తిమింగలతో ఎన్టీఆర్ కు ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచే ఎపిసోడ్ ఇదే అవుతుందని మూవీ టీమ్ బలంగా నమ్ముతోందట. షార్క్ తో ఫైట్ అంటే గతంలో ఛత్రపతిలో ఉంది. ఆ టైమ్ కు మనకున్న గ్రాఫిక్‌స్ సోర్స్ కు అదే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. దీంతో సారి తారక్ తో షార్క్ ఫైట్ మామూలుగా ఉండదు అంటున్నారు. దీనికోసం విదేశీ టెక్నాలజీని, టెక్నీషియన్స్ ను కూడా వాడతారు అంటున్నారు. మొత్తంగా ఆక్వామాన్ లాగా దీన్ని ఇప్పుడు TARAQUAMAN అనే పేరుతో పిలవబోతున్నారు.


ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయినా బేసిక్ గా తెలుగు సినిమా కాబట్ట�