దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లిస్టులో యంగ్ హీరో సుహాస్ సినిమా కూడా ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మాతలుగా సుహాస్ హీరోగా కొత్త సినిమాని ప్రకటించారు. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘జనక అయితే గనక‘ అనే వెరైటీ టైటిల్ పెట్టారు.

ఫుల్ లెన్త్ ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ ను జూలై 4న విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో సుహాస్ కి జోడీగా సంగీర్తన విపిన్ నటిస్తుంది. ‘బేబి‘ ఫేమ్ విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Related Posts