‘స్వాగ్‘ మేకోవర్ కోసం శ్రీవిష్ణు కష్టాలు

ఎక్కువగా పక్కింటబ్బాయి తరహా పాత్రలలో కనిపించే శ్రీవిష్ణు.. ఇప్పటివరకూ తన మేకోవర్ పరంగా పెద్దగా ఛేంజెస్ ఏమీ చూపించలేదు. అయితే.. అప్ కమింగ్ మూవీ ‘స్వాగ్‘ కోసం శ్రీవిష్ణు పలు విభిన్న గెటప్స్ లో అలరించబోతున్నాడు. ఈ సినిమాలో ఏకంగా 14 గెటప్స్ లో శ్రీవిష్ణు కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా ‘స్వాగ్‘ నుంచి శ్రీవిష్ణు పోషిస్తున్న పాత్రల్లో ఒకటైన భవభూతి క్యారెక్టర్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది టీమ్.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ పట్టణం రషీద్.. శ్రీవిష్ణు పోషిస్తున్న భవభూతి పాత్రకు మేకోవర్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం శ్రీవిష్ణు ప్రతిరోజూ నాలుగు గంటల పాటు ఓపిగ్గా కూర్చుని మేకప్ వేసుకునేవాడట. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘స్వాగ్‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts