వచ్చే శనివారం ‘సరిపోదా శనివారం’ మొదటి పాట

మిగతా రోజుల్లో మామూలుగా ఉండే కథానాయకుడు.. శనివారం వచ్చిందంటే చాలు సరికొత్త ఉత్సాహంతో రెచ్చిపోతుంటాడు. అతనికి, శనివారానికి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే.. అందరూ అతన్ని ‘సరిపోదా శనివారం’ అంటుంటారు. నేచురల్ స్టార్ నానితో ఈ ‘సరిపోదా శనివారం’ ప్రయోగం చేస్తున్నాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ వస్తోన్న సినిమా ఇది.

ఆగస్టు 29న విడుదలకు ముస్తాబైన ‘సరిపోదా శనివారం’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. వచ్చే శనివారం అంటే జూన్ 15న ‘సరిపోదా శనివారం’ నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి స్పెషల్ అనౌన్స్ మెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్ లో మెస్మరైజ్ చేయనున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో ఎస్.జె.సూర్య, సాయికుమార్ వంటి వారు కనిపించబోతున్నారు.

Related Posts