టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. హిస్టారికల్ స్టోరీకి మోడర్న్ టచ్ ఇస్తూ.. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడట దర్శకుడు హాసిత్ గోలి.
ఈ చిత్రంలో శ్రీవిష్ణు శ్వాగణిక వంశానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నట్టు ప్రచార చిత్రాలు వదిలారు. అలాగే.. వింజామర వంశ యువరాణి రుక్మిణి దేవి పాత్రలో రితూ వర్మ అలరించనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సీనియర్ బ్యూటీ మీరా జాస్మిన్ ‘స్వాగ్’ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
లేటెస్ట్ గా ఈ మూవీలో మరికొంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ భాగస్వాములయ్యారు. దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్ వంటి ఫీమేల్ యాక్టర్స్ తో పాటు.. సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక.. వీరంతా ఆన్ బోర్డులోకి వచ్చినట్టు చెబుతూనే వారి పోస్టర్స్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ యాక్టర్స్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తూ.. ‘స్వాగ్’లో వీరి స్వాగ్ సమ్‌థింగ్ స్పెషల్ గా ఉండబోతుందనే అంచనాలు పెంచుతున్నారు.