సినిమా హిట్టే.. కానీ ఇక్కడ వర్కవుట్ అవుతుందా

కన్నడలో ఒక సినిమా హిట్ అయిందంటే.. వెంటనే ఇతర భాషల వాళ్లు ఆ సినిమాలను డబ్ చేసుకోవడానికి చూస్తున్నారు. కేజీఎఫ్, కాంతార తర్వాత అక్కడి సినిమాలు ఇతర భాషల్లోనూ ఆకట్టుకుంటున్నాయి అనుకున్నారు. బట్ ఆ భ్రమలను ఆ మధ్య వచ్చిన హాస్టల్ డేస్ అనే సినిమా తుడిచేసింది. ఈ సినిమా కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అందుకేవెంటనే తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. మన దగ్గర మినిమం కూడా పట్టించుకోలేదా సినిమాను. ఇక ఇప్పుడు చార్లీ777 ఫేమ్ రక్షిత్ శెట్టి నటించిన ‘సప్తసాగరదాచె ఎల్లో సైడ్ ఏ’. అంటే ఎడు సంద్రాలకు ఆవల అని అర్థం. హేమంత్ ఎమ్. రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అక్కడ అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన సినిమా ఇది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా.. ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించే కథతో రూపొందిందీ సినిమా.


రక్షిత్ శెట్టికి కన్నడలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతను ముందు నుంచీ వైవిధ్యమైన సినిమాలతో మెప్పించాడు. అలా ఈ చిత్రంపైనా అంచనాలున్నాయి. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ తో ఆకట్టుకుంది. అయితే మొదటి వారం ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమా మరీ స్లోగా ఉందనీ.. చాలా నీరసంగా సాగుతుందని రివ్యూస్ కూడా వచ్చాయి. ఆశ్చర్యంగా వీక్ డేస్ లో పుంజుకుందీ చిత్రం. స్లో నెరేషన్ ఉన్నా సూపర్బ్ గా ఉందనే మాటలు వినిపించాయి. అలా మెల్లగా హిట్ టాక్ తెచ్చుకుంది. బట్ తెలుగులో ఇలా స్లో నెరేషన్ఉంటే మన ఆడియన్స్ కు ఎక్కుతుందా అనేదే పెద్ద పాయింట్.


రక్షిత్ ఇంతకు ముందు తెలుగులో చార్లీ777 అనే సినిమాను రిలీజ్ చేసినప్పుడు కూడా ఇదే టాక్. స్లో నెరేషన్అని. ఆ సినిమా పోయిన తర్వాత కానీ అర్థం కాలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. ఎంత ఫీల్ గుడ్ మూవీ అయిన మనవాళ్లకు స్లో నెరేషన్ అంటే అస్సలే గిట్టదు. జాను లాంటి సినిమానే సినిమానే ఈ కారణంతో పక్కన బెట్టారు. మరి ఈ మూవీ కాస్టింగ్ జనరల్ ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. కాకపోతే రిలీజ్ డేట్ పరంగా చూసుకుంటే కాస్త బెటర్ అని చెప్పాలి.


ఈ చిత్రానికి ఇది ఫస్ట్ పార్ట్. అంటే సైడ్ ఏ అన్నారు. సైడ్ బి అక్టోబర్లో దసరా సందర్భంగా వస్తుంది. ఈ చిత్రానికి ఎంత హిట్ టాక్ వచ్చినా.. సెకండ్ పార్ట్ తెలుగులో దసరాకు విడుదల చేసే ధైర్యం చేస్తారనుకోలేం.

Related Posts