సల్మాన్ ఖాన్ తో సమంత

మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత దాన్నుంచి కోలుకుని ఈ మధ్యే ఖుషీ చిత్రాన్ని కంప్లీట్ చేసింది. ఈ సినిమాతో ఓ విజయం ఖాతాలో వేసుకుందనే చెబుతున్నారు మేకర్స్. ఖుషీ తర్వాత యేడాది పాటు మరే సినిమా చేయకుండా తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ సినిమాలు చేయాలని ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది సమంత. అప్పటి నుంచి దేశాలు పట్టుకుని తిరుగుతూ.. మానసికంగా, శారీరకంగా దృఢంగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఖుషీ తర్వాత మళ్లీ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇక లేటెస్ట్ గా తనకు బంపర్ ఆఫర్ వచ్చిందట. అందుకే తన ఒట్టు తీసి గట్టుపెట్టి మళ్లీఓ కొత్త సినిమాకు సైన్ చేయబోతోంది అంటున్నారు.


ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే.. బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం. యస్.. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీలో ఓ సౌత్ హీరోయిన్ ను మాత్రమే తీసుకోవాలని కండీషన్ పెట్టాడట. ఆ పాత్ర కోసం సమంత అయితే బెటర్ అని దర్శకుడు విష్ణువర్థన్ భావించి ఆమెను అప్రోచ్ అయ్యాడట. ఇదే పాత్రకోసం గతంలో త్రిషను కూడా అడిగారట. తను ఏమీ తేల్చలేదు. దీంతో సమంత వద్దకు వచ్చింది. మరి సమంత ఇంత పెద్ద ఆఫర్ ను వదులుకుంటుందిఅనుకోలేం.

పైగా కొన్నాళ్ల నుంచి తను కూడా బాలీవుడ్ లోనేపాగా వేయాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భాయ్ తో వచ్చిన ఛాన్స్ ను వదులుకోవడం దాదాపు జరగదు. అందుకే యేడాది పాటు నటించకూడదు అనే తన ఒట్టుని తీసి గట్టున పెట్టి ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది.

Related Posts