గతంలో తాను తప్పులు చేశానన్న సమంత

కంపెనీలకు మార్కెటింగ్ లో చాలా ముఖ్యమైనది సినీ తారలు. అందుకే.. తమ ప్రొడక్ట్స్ కి పలు దశాబ్దాలుగా.. సినీ స్టార్స్ ను ప్రచారకర్తలుగా ఉపయోగించుకుంటున్నారు. నటీనటులు కూడా ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు ఎండోర్స్ మెంట్స్ లో నటించడానికి పోటీపడుతుంటారు. ‘మీ కోల్గేట్ లో ఉప్పుందా’ అంటూ.. సంవత్సరాలుగా చెప్పిందే చెబుతుంటారు స్టార్స్. అలాగే.. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, లేయ్స్, నూడుల్స్ ఇలా అన్ని రకాల అడ్వర్‌టైజ్ మెంట్స్ లోనూ నటించేస్తుంటారు.

పలు ప్రోడక్ట్స్ కి ఎండోర్స్ చేసే సెలబ్రిటీస్ .. ఆయా వస్తువుల బాగోగులు తెలుసుకోకుండానే.. వాటిని ప్రమోట్ చేస్తుంటారు. అలా.. వారు ఎండోర్స్ చేస్తున్న ప్రోడక్ట్స్.. ఒకవేళ ప్రజలకు మేలు చేసేవి కాకపోతే.. వాటిని ప్రచారం చేస్తున్న సెలబ్రిటీస్ పై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయినా.. కొంతమంది సెలబ్రిటీస్ ఇవి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.

మరికొంతమంది ఆలస్యంగానైనా తప్పు తెలుసుకుని అలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఈ లిస్టులో సమంత కూడా ఉంది. టేక్ 20 పేరుతో ఈ ఏడాది ప్రథమార్థంలో ఓ హెల్త్ పాడ్‌కాస్ట్ మొదలుపెట్టింది సమంత. ఇందులో భాగంగా ‘కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్’ గురించి కొత్త ఎపిసోడ్ చేసింది. అందుకు సంబంధించి ఎపిసోడ్ ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది.

ఈ ఎపిసోడ్ ను చూసిన నెటిజన్స్ లో ఒకరు ‘ఈమె నంబర్ వన్ డ్రామా క్రియేట్ చేస్తుంది. గతంలో ఈమె చాలా ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్ యాడ్స్ లో నటించింది’ అని కామెంట్ చేశాడు. దానికి రిప్లై ఇచ్చిన సామ్.. తాను గతంలో అలాంటి తప్పులు చేశానని.. వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలియక అలాంటివి ఒప్పుకున్నానని’ రిప్లై ఇచ్చింది. అలాగే.. తాను ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి అలాంటి ఎండోర్స్‌మెంట్స్ చేయడం మానేశానని’ తెలిపింది.

చాలా కాలం క్రితమే సమంత వేగన్ గా మారింది. అంటే.. నాన్-వెజిటేరియన్, డెయిరీ ప్రాడక్ట్స్ తీసుకోదు. అలాగే.. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత తన ఆరోగ్యం విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది. సినిమాల విషయానికొస్తే.. సొంత నిర్మాణ సంస్థ ‘త్రాలల మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై ‘మా ఇంటి బంగారం‘ పేరుతో మూవీని ఆమధ్య అనౌన్స్ చేసింది.

Related Posts