‘హిట్’ ఫ్రాంఛైస్ కోసం రంగంలోకి నాని

నేచురల్ స్టార్ గా నటనా రంగంలో దూసుకెళ్తున్న నాని.. మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటూనే ఉన్నాడు. నాని ప్రొడక్షన్ లో వచ్చిన ‘హిట్’ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సిరీస్ లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి భాగంలో విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తే.. రెండో పార్ట్ లో అడివి శేష్ కథానాయకుడిగా అలరించాడు. ఇప్పుడు మూడో భాగం కోసం నాని నే రంగంలోకి దిగుతున్నాడు.

‘హిట్ 3’కి హీరో, నిర్మాత నాని. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్శ్ లో రాబోతున్న ‘హిట్ 3’కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చాయట. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక.. ‘హిట్ 3’లో నాని హీరో అయితే.. విలన్ గా భళ్లాలదేవ రానా నటించనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

నాని-రానా మంచి మిత్రులు. ఆ అనుబంధంతోనే ‘హిట్ 3’లో విలన్ గా నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కొన్ని రోజుల్లోనే ‘హిట్ 3’కి సంబంధించి అనౌన్స్‌మెంట్ రానుందట.

Related Posts