సలార్ టీజర్ డేట్ వచ్చేసింది..

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కంట్రీ మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తోన్న సినిమాల్లో సలార్ ఒకటి. ఇప్పటి వరకూ ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక ఈమూవీ హంగామా ముగిసిపోయినట్టే అని సోమవారం వచ్చిన కలెక్షన్స్ చూస్తే అర్థమైంది. మూడు రోజుల్లోనే 340 కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా. అంటే రోజుకు వంద కోట్లు అన్నమాట. సోమవారం కేవలం 35 కోట్లు మాత్రమే వచ్చాయి.

దీన్ని బట్టి పబ్లిక్ టాక్ ఈ మూవీపై ఎంత నెగెటివ్ గా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ కూడా ఎలాగూ ఈ మూవీని సీరియస్ గా తీసుకోవడం లేదు. అందరి దృష్టీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సలార్ పైనే ఉంది. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా..? వారి హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అలా షేక్ అయిపోయే తరుణం అతి త్వరలోనే ఉంది. సలార్ మూవీ టీజర్ కు ముహూర్తం సెట్ అయింది.


ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న సలార్ టీజర్ ను జూలై 7న విడుదల చేయబోతున్నారు. ఈ డేట్ అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు కానీ.. అదే డేట్ లో టీజర్ వస్తుందని ఖాయమైంది. ఆదిపురుష్‌ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. తన మోకాలికి చిన్న సర్జరీ చేయించుకోవడానికి ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి రాగానే ఈ టీజర్ ను ఫైనల్ చేస్తారు. ఆదిపురుష్‌ టీజర్ ఇచ్చిన షాక్ మైండ్ లో ఉంటుంది కాబట్టి.. ఒకటికి రెండుసార్లుచెక్ చేసుకుని మరీ ఈ టీజర్ బయటకు వదులుతారు.

అయితే ఇది కంప్లీట్ గా కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి.. మరీ అంతగా భయప