సాయిధరమ్‌ తేజ్ కాదు.. ఇకనుంచి సాయిదుర్గ తేజ్‌

సాయిధరమ్‌ తేజ్… ఇక నుంచి పేరు మార్చుకుని సాయిదుర్గ తేజ్‌ గా మారాడు. తాను చేసిన మ్యూజికల్ షాట్‌ ఫీచర్‌ ‘సత్య‘ ఉమెన్స్ డే సందర్భంగా మీడియా మిత్రులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఇక నుంచి తన పేరు సాయిదుర్గ తేజ్‌ గా మార్చుకుంటున్నానన్నారు. తన జీవితంలో ముగ్గురు ముఖ్యమైన మహిళలున్నారు. అమ్మమ్మ అంజనాదేవి, అమ్మ విజయ దుర్గ, పిన్ని మాధవి… వీరే నా బలం, నా బిగ్గెస్ట్ హ్యాపీనెస్‌ అన్నారు సాయిదుర్గ తేజ్‌. మ్యూజిక్ షాట్ ఫీచర్‌ ‘సత్య’ లో సాయిదుర్గ తేజ్‌ కు జోడీగా కలర్స్ స్వాతి నటించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హర్షిత్‌రెడ్డి, హన్షిత కలిసి నిర్మిస్తున్నారని తెలియగానే నేనూ భాగమవుతానని విజయదుర్గ ప్రొడక్షన్స్‌ సంస్థ కూడా ఈ ప్రొడక్షన్ లో జాయిన్ అయ్యిందన్నారు సాయి దుర్గ తేజ్

.
ఈ చిత్ర దర్శకుడు నవీన్ విజయకృష్ణ తన ఫ్రెండ్ అనీ.. తను నాలో కొత్త యాంగిల్ ను బయటకు తీసుకొచ్చాడన్నారు. ఈ ఫిల్మ్ 25 ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి.. అవార్డ్స్‌ కూడా సాధించిందన్నారు.
తన పేరు సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయిదుర్గ తేజ్‌గా మార్చుకోవడం వెనుక అసలు కారణం అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి అందుకే తన పేరును సాయిదుర్గ తేజ్‌గా మార్చుకుంటున్నానన్నారు. అమ్మ పేరు మీద విజయదుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్‌ స్థాపించి దిల్‌రాజు ప్రొడక్షన్స్‌తో కలసి ఈ చిత్ర నిర్మాణం జరిపామన్నారు.


సోల్జ‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షాట్ ఫీచర్ ను చెప్పాల‌నేది హ‌ర్షిత్ ఐడియా. ఆ ఐడియా న‌చ్చి నేను, సాయి జాయిన్ అయ్యాం. ఇండియాలో ఎంతో గొప్ప మ‌హిళ‌లు వున్నారు. అలాంటి వాళ్ల కొంత మంది వాళ్ల గురించి అంద‌రికి తెలియాలి. చాలా మంది వీర‌నారిల క‌థ అంద‌రికి తెలియాలి. నేడు మ‌హిళ‌లు �