సాగర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ‘ది 100‘

‘మొగలి రేకులు‘ ఫేమ్ సాగర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది 100‘. ఈ మూవీలో పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ గా కనిపించబోతున్నాడు సాగర్. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాని రమేష్ కరుటూరి, వెంకి పుషాదపు, జె.తారక్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. లేటెస్ట్ గా ‘ది 100‘ మూవీ మోషన్ పోస్టర్ లాంఛ్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక.. ‘ఇట్స్ జస్ట్ నాట్ ఎ నంబర్.. ఇట్స్ ఎ వెపన్‘ అంటూ విడుదలైన ‘ది 100‘ మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

Related Posts