జైలర్ బడ్జెట్ లో రెమ్యూనరేషన్సే ఎక్కువ

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఈ నెల 10న విడుదల కాబోతోన్న ఈ మూవీతో సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయం అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో బిజినెన్ కూడా అయింది. ముఖ్యంగా ట్రైలర్ సినిమాకు భారీ బజ్ ఇచ్చింది. అంతకు ముందు తమన్నా చేసిన నువ్వు కావాలయ్యా పాట కంట్రీ మొత్తం కవర్ అయిపోయింది. ఇక ఈ సినిమా బడ్జెట్ కంటే ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ పరంగా హాట్ టాపిక్ అయింది. మరి ప్రధాన పాత్రల్లో నటించిన వారి రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా..
హీరోగా నటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు 110 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ వయసులో కూడా ఆ ఫిగర్ అంటే అది రజినీకాంత్ కు మాత్రమే సాధ్యమైంది. తన సమకాలీకుల్లో ఎవరికీ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ లేదు. మరి సూపర్ స్టార్ సినిమా అంటే ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా భారీ క్రేజ్ ఉంటుంది కాబట్టే ఆయనకు ఈ రేంజ్ వచ్చింది. సో.. రజినీ రెమ్యూనరేషన్ 110 కోట్లు.
ప్రస్తుతం ఎలాంటి పాత్రైనా ఎలాంటి సీన్స అయినా చేస్తూ కెరీర్ లో మరో టర్న్ తీసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా రెమ్యూనేషన్ 3 కోట్లు. ఇంత సీనియర్ అయిన తనకు ఆ రెమ్యూనరేషన్ అంటే పెద్ద విషయంగానే చెప్పాలి.


ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ కు ఎక్కువ కీలక పాత్రకు తక్కువ అన్నట్టుగా నటించిన మోహన్ లాల్ సైతం భారీగా తీసుకున్నాడు. ఆయన పాత్రకు 8 కోట్లు ఇచ్చారట. సినిమాలోని పాత్రగా చూస్తే ఈ ఫిగర్ చాలా పెద్దదే అంటున్నారు. కానీ ఆయన కూడా పెద్ద నటుడే కదా.. అందుకే ఆ అమౌంట్. .
మరో కీలక పాత్ర చేసిన కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ కు 4 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ మూవీకి శాండల్ వుడ్ లో శివన్న వల్ల మరింత ఎక్కువ టికెట్స్ తెగుతాయి. కన్నడనాట భారీ రెమ్యూనరేషన్స్ ఉండవు. అందువల్ల శివన్న పాత్రకు ఇచ్చింది పెద్ద మొత్తమే అంటున్నారు.
విలన్ గా నటించిన బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కు సైతం 4 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. కొన్నాళ్లుగా సౌత్ లో విలన్ గా బాగా రాణిస్తున్నాడు జాకీష్రాఫ్. రజినీకాంత్ కు జూనియర్ అయిన జాకీ వల్ల సినిమాకు కొంత గ్రాఫ్ పెరుగుతుందనే చెప్పాలి.<