అమితాబ్ బచ్చన్ టైటిల్ తో రజనీకాంత్

బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ‘కూలీ’ చిత్రానిది ప్రత్యేక స్థానం. నాలుగు దశాబ్దాల క్రితం విడుదలైన ‘కూలీ’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే టైటిల్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీకి ‘కూలీ’ టైటిల్ ఖరారు చేశారు.

సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. టీజర్ ఆద్యంతం అన్బారివ్ కంపోజ్ చేసిన ఫైట్ సీన్ తో అనిరుధ్ మ్యూజికల్ మ్యాజిక్ తో గూస్‌బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈ టైటిల్ టీజర్ లో సూపర్ స్టార్ ఎంట్రీ అదిరింది.

‘మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు.. తప్పేంటి ఒప్పేంటి.. కొత్తగా కుమ్మేసెయ్.. ఏ దారిలో వెళ్లినా సుఖాన్ని విడువకు’ అంటూ రజనీకాంత్ ఈ టీజర్ లో చెప్పిన డైలాగ్ బాగుంది. అలాగే.. ‘విందుంది.. చిందుంది.. మందుంది.. సుఖముంది.. అనుభవించే మనసుందంటే.. స్వర్గంలో చోటుంటుంది.. పోరా..!’ అంటూ విలన్ ని చితకబాదుతూనే తనదైన స్వాగ్ తో సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ ఈ టీజర్ కే మెయిన్ హైలైట్. మొత్తంమీద.. త్వరలో పూర్తిస్థాయిలో షూటింగ్ మొదలుపెట్టుకోనున్న రజనీకాంత్ ‘కూలీ’కి సంబంధించి మిగతా కాస్టింగ్ విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

Related Posts