రాజ్ తరుణ్.. మరీ ఇంత దారుణమా

రాజ్ తరుణ్.. ఉయ్యాల జంపాల సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టాడు. టైర్ త్రీ హీరోస్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకున్నాడు కూడా. అతని ఖాతాలో కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్తమావా, ఈడోరకం ఆడోరకం వంటి విజయాలుఉన్నాయి. ఈ విజయాలతో అతను బాక్సాఫీస్ వద్ద బానే మెప్పించాడు కూడా.

కానీ తర్వాత వీక్ కంటెంట్స్ తో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయలేకపోయాడు. వచ్చిన సినిమాలన్నీ వరుసగా పోయాయి. రకరకాల ప్రయోగాలు చేసినా ఏదీ కలిసి రాలేదు. దీంతో బాగా వెనకబడ్డాడు. అలాగని అసలు సీన్ లోనే లేకుండా లేడు. ప్రస్తుతం తిరగబడర సామి, అనే మూవీతో పాటు మరో ప్రాజెక్ట్ ఉంది. ఎలా చూసినా మంచి గుర్తింపు ఉన్న హీరోనే కదా.. అలాంటి హీరోను అస్సలు ఒక్క డైలాగ్ కూడా లేని గెస్ట్ రోల్ కు పరిమితం చేయడం అంటే అది కూడా వెరీ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో చూపించడం అంటే దారుణమే కదా. అఫ్‌ కోర్స్ ఈ దారుణానికి ఒప్పుకున్నది అతనే. అయినా అతనికి ఏం చెప్పిఒప్పించారో.. తీసిందంతా సినిమాలో ఉంచారో లేదో కూడా తెలియదు.


ఈ శుక్రవారం విడుదలైన మను చరిత్ర అనే సినిమాలో మేఘా ఆకాశ్ ను పెళ్లి చేసుకునే జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించాడు రాజ్ తరుణ్‌. సరైన క్లోజప్స్ కూడా పడని ఈ పాత్రలో అతన్ని పరికించి చూస్తే కానీ గుర్తించలేనంతగా ఉన్నాడు. మరి అసలు ఈ పాత్రను ఎందుకు ఒప్పుకున్నాడో ఏమో కానీ.. హీరోగా ఓ రేంజ్ గుర్తింపు తున్న రాజ్ తరుణ్‌ ను ఇలాంటి అస్సలే మాత్రం గుర్తింపు లేని పాత్రలో చూసి చాలామంది మరీ ఇంత దారుణమా అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

<