‘డార్లింగ్’ కోసం మందు పాటతో ప్రియదర్శి

ఒకవైపు కమెయడిన్ గా అగ్రపథాన దూసుకెళ్తూనే.. మరోవైపు కథానాయకుడిగానూ ప్రత్యేకమైన పాత్రలతో తన విలక్షణతను చాటుకుంటున్నాడు ప్రియదర్శి. ఈకోవలోనే ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రాబోతున్న చిత్రం ‘డార్లింగ్’. ‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఖలాసే’ అంటూ సాగే పాట ప్రోమో రిలీజైంది. సినిమాలో మందు పాటగా అలరించనున్న ఈ గీతంలో ‘ఖలాసే ఖలాసే మామ నా బ్రతుకే’ అంటూ తన ‘డార్లింగ్’కి తనకి మధ్య జరిగిన విషయాలను తలచుకుంటూ ప్రియదర్శి బాధతో పాడుకునే పాటగా ఈ గీతం ఉంది. ఈ ఫుల్ సాంగ్ మరికొద్ది గంటల్లో రాబోతుంది.

Related Posts