ప్రవీణ్‌ సత్తారు.. తర్వాతేంటీ..

ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ పడితేనే పక్కన పెట్టేస్తుంటారు. అలాంటిదివరుసగా రెండు ఫ్లాపులు అంటే వేరే నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఎక్స్ ట్రీమ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయితే తప్ప రెండు ఫ్లాపుల తర్వాత కూడా వెంటనే సినిమా పడదు. లేదంటే కొన్నాళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. మరో కథను అద్భుతంగా నెరేట్ చేస్తే తప్ప.. వర్కవుట్ కాదు. అఫ్‌ కోర్స్ నిర్మాతలకు నెరేట్ చేసిన కథలన్నీ అలాగే ఆడియన్స్ వరకూ వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకు తాజా ఉదాహరణ గాండీవధారి అర్జున. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వచ్చిన డౌట్ ఏంటంటే.. అసలు దీన్ని కథగా ఎలా చెప్పాడా అనే డౌట్ వస్తుంది. అంత వీక్ గా ఉంటుంది ప్లాట్. అయినా నిర్మాత నమ్మాడు అంటే నెరేషన్ లో ఉండే మాయాజాలమే అంతా. అది మాయ అని తెలియడానికి సినిమా విడుదల కావాలి. గాండీవధారికి మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది.


ఇక ప్రవీణ్‌ సత్తారు అంతకు ముందు ఘోస్ట్ అనే మరో కళాఖండం తీసి ఉన్నాడు. నాగార్జున చాలా చాలా నమ్మి మరీ చేసిన సినిమా ఇది. నిజానికి ఈ పాయింట్ బానే ఉంటుంది. కథగా కూడా కన్విన్స్ చేయగలిగే ప్లాట్. కథన లోపం వల్ల పోయింది. నాగార్జునను ఈ తరహా పాత్రలో ఫస్ట్ టైమ్ చూసినా.. వీక్ స్క్రీన్ ప్లే ఈ సినిమాను దెబ్బ కొట్టింది. అంటే ఘోస్ట్ కు కథ బావుంటే కథనం బాలేదు.. గాండీవధారికి రెండూ బాలేదు. దీన్ని బట్టి అతను ఘోస్ట్ ఫ్లాప్ నుంచి నేర్చుకున్న దానికంటే మర్చిపోయిందే ఎక్కువ. సో..ఇక మరో సినిమా రావాలంట ప్రవీణ్‌ కు ఇంకాస్త ఎక్కువ టైమే పడుతుంది.


పిఎస్వీ గరుడవేగతో తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చాడు ప్రవీణ్. అంతకు ముందు చేసిన గుంటూరు టాకీస్, చందమామ కథలు, రొటీన్ లవ్ స్టోరీ, ఎల్బీ డబ్ల్యూ వంటి కథలన్నీ పర్టిక్యులర్ ఆడియన్స్ ను ఉద్దేశించి చేసినవి. అంటే డిఫరెంట్ జాన్రాస్ అన్నమాట. ఇక గరుడవేగకు ఘోస్ట్ కు మధ్య 11 అవర్స్ అనే ఓ వెబ్ సిరీస్ చేశాడు. ఇదీ పోయింది.