ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసిన ప్రభాస్ పోస్ట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి. అలాంటి రెబెల్ స్టార్ నుంచి ఊహించని పోస్ట్ ఒకటి వచ్చింది. లేటెస్ట్ గా తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు ప్రభాస్.

‘డార్లింగ్స్.. మన లైఫ్ లోకి చాలా ప్రత్యేకమైన ఓ వ్యక్తి ఎంటర్ కాబోతున్నారు.. వెయిట్ చెయ్యండి’ అనేది ఆ పోస్ట్ సారాంశం. ఈ పోస్ట్ ను ఎలా అర్థం చేసుకోవాలి అని తలలు పట్టుకుంటున్నారు ఫ్యాన్స్. మన లైఫ్ లోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటే.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా? తనకు కాబోయే భార్యను పరిచయం చేయబోతున్నాడా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

మరోవైపు.. త్వరలో విడుదలకు ముస్తాబైన ‘కల్కి’ ప్రమోషన్ లో భాగంగానే ప్రభాస్ ఈ పోస్ట్ చేశాడనే ప్రచారం జోరందుకుంది. ఏదిఏమైనా.. ఈ పోస్ట్ గురించి మళ్లీ ప్రభాస్ నుంచి వివరణ వచ్చే వరకూ ఆ సస్పెన్స్ కు తెరపడదు.

Related Posts