‘కల్కి’ని పొగడ్తలతో ముంచెత్తిన కోలీవుడ్ సూపర్‌స్టార్

‘కల్కి’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ దక్కుతోంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ‘కల్కి’ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ లిస్టులో లేటెస్ట్ గా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా చేరారు.

‘కల్కి’ సినిమాని చూశానని.. వాట్ ఎ ఎపిక్ మూవీ అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ప్రశంసల జల్లు కురిపించారు సూపర్ స్టార్. ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడన్నారు. ఈ సందర్భంగా.. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు సూపర్ స్టార్.

మరోవైపు.. ‘కల్కి’ నుంచి ‘టా టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజయ్యింది. సినిమా మొత్తానికి ఇదొకటే పాట. ఈ పాటలో డార్లింగ్ ప్రభాస్ రొమాంటిక్ మోడ్ లో సందడి చేశాడు. అలాగే.. తాను సృష్టించిన కాంప్లెక్స్ అందాలను ఈ పాటలో సరికొత్తగా ఆవిష్కరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

Related Posts