‘స్పిరిట్’ కోసం రెండు గెటప్స్ లో ప్రభాస్

ప్రభాస్ కటౌట్ కి సూటయ్యే పర్ఫెక్ట్ క్యారెక్టర్ పోలీస్. అయితే.. ఇప్పటివరకూ డార్లింగ్ ను పోలీస్ డ్రెస్ లో చూసే ఛాన్స్ రాలేదు. ఆ అవకాశం ఇప్పుడు ఫ్యాన్స్ కు ‘స్పిరిట్’తో కల్పించబోతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ‘యానిమల్’ వంటి కల్ట్ మూవీ తర్వాత సందీప్ తెరకెక్కించబోతున్న సినిమా ఇది.

‘స్పిరిట్’లో ప్రభాస్ రెండు పాత్రల్లో కనువిందు చేయబోతున్నాడట. ఒక పాత్ర పూర్తిగా మాస్ అవతార్ లో మెస్మరైజ్ చేస్తుందట. ఆ క్యారెక్టర్ ను ఎంతో రఫ్ అండ్ రస్టిక్ గా డిజైన్ చేస్తున్నాడట సందీప్ రెడ్డి. అలాగే.. మరో పాత్రలో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తాడట. ఈ రెండు క్యారెక్టర్స్ ఒకదానితో మరొకటి పోల్చలేనంత వైవిధ్యంగా ఉంటాయట.

ఇప్పటికే 70 శాతం వరకూ స్క్రిప్ట్ పనులు పూర్తిచేసుకున్న ‘స్పిరిట్’ను ఈ ఏడాదిలోనే పట్టాలెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నాడు సందీప్. మరోవైపు.. ప్రభాస్ కిట్టీలో సినిమాల లిస్ట్ మామూలుగా లేదు. ఈనెలలో ‘కల్కి’తో రాబోతున్న రెబెల్ స్టార్.. ఆ తర్వాత మారుతితో ‘రాజా డీలక్స్’ను రిలీజ్ కు రెడీ చేయనున్నాడు. హను రాఘవపూడి తో చేసే సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంకా.. మోస్ట్ అవైటింగ్ ‘సలార్ 2’ కూడా ప్రభాస్ విష్ లిస్ట్ లో ఉంది.

Related Posts