పొలిటీషియన్ కొడుకు లవ్ లో నితిన్ హీరోయిన్ ?

మేఘా ఆకాశ్.. తెలుగులో లై అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. తన ఫీచర్స్ చూసి స్టార్ హీరోయిన్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఫస్ట్ మూవీ పోయింది. తర్వాత చేసిన ఛలో మోహనరంగా కూడా పోయింది. ఈ చిత్రానికి ఏకంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలుగా ఉన్నారు. అయినా ఆకట్టుకోలేదు. దీంతో ఐరన్ లెగ్ అన్నారు.

అదేంటో కానీ పాపం తన ఇన్నాళ్ల కెరీర్ లో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. తెలుగులోనే కాదు.. తమిళ్ లో సైతం అమ్మడికి బ్లాక్ బస్టర్స్ పడకపోవడం విచిత్రమే. అయినా వరస ఆఫర్స్ అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉందీ బ్యూటీ. రీసెంట్ గా వచ్చిన రావణాసురలో నెగెటివ్ రోల్ చేసింది. ఆ సినిమా కూడా పోవడంతో అమ్మడి కష్టం వృధా అయింది. తన కెరీర్ లో ఇప్పటి వరకూ రాజ రాజ చోర మాత్రమే చాలా వరకూ బెటర్ అనిపించుకుంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళ్ లో ఒక సినిమా ఉన్నాయి తనకు. అయితే ఈ మధ్య కాలంలో తను పెళ్లి చేసుకోబోతోంది అనే రూమర్స్ రెండు భాషల్లోనూ వినిపిస్తున్నాయి. వీటిని తను కానీ తన టీమ్ కానీ ఖండించకపోవడంతో అది నిజమే అనుకున్నారు అంతా.


మేఘా పెళ్లి చేసుకోబోతోందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ప్రస్తుతం ఆమె ఓ పొలిటీషియన్ కొడుకుతో డేటింగ్ లో మాత్రం ఉందట. ఆ పొలిటీషియన్ ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ ఇద్దరూ మాత్రం తమ రిలేషన్ షిప్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లాలనుకుంటున్నారట. అంటే పెళ్లే కదా. అయితే అప్పుడే కాదు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి పూర్తిగా ఓ నిర్ణయానికి రావొచ్చు అనుకుంటున్నారని టాక్. ఏదేమైనా అమ్మడు చూడ్డానికి చాలా కామ్ గా ఉంటుంది కానీ.. చాలా త్వరగానే లవ్ లో పడిపోయింది..