హత్య కేస్ లో పోలీస్ లు పరారీ

ఏ సినిమాకు అయినా కంటెంటే కింగ్. కంటెంట్ బలంగా ఉంటే బాక్సాఫీస్ షేక్ అవుతుందని చిన్న సినిమాలు కూడా నిరూపిస్తున్న కాలం ఇది. స్టార్డమ్ కంటే స్టోరీలో దమ్మే ప్రధానం అని నమ్ముతున్నారు ప్రేక్షకులు.రీమేక్ లైనా సరే.. కంటెంట్ ఉంటే కలెక్సన్స్ వచ్చేస్తాయి.ఈ తరహాలో బలమైన కథలు చెప్పడంలో మళయాలీల తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు.

అలా 2021లో మాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా నాయాట్టు(వేట అని అర్థం) సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సంచలనం సృష్టించింది. ఓ హత్య కేస్ లో పోలీస్ లే ఇరుక్కుంటారు. దాని చుట్టూ పెద్ద పొలిటికల్ మాఫియా ఉంటుంది. ఓ వైపు పోలీస్ లను పోలీస్ లే వెంటాడుతుంటే.. ఆ వేట నుంచి తప్పించుకుంటూనే తాము నిర్దోషులం అని నిరూపించుకోవాల్సి వచ్చిన ముగ్గురు పోలీస్ ల కథ ఇది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.


గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ మూవీకి ‘కోట బొమ్మాళి పి.ఎస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంటే కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కథ అనుకోవచ్చు. తెలుగులో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్టిస్టులు చూస్తే మంచి ఛాయిస్ అనిపిస్తోంది. శ్రీకాంత్ ఈ తరహా సీరియస్ కాప్ రోల్స్ ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి బాగా సెట్ అవుతాడు.

ఇక టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా బావుంది. “హత్య కేస్ లో ప్రధాన నిందుతులుగా పోలీస్ లు.. పరారీలో కోటబొమ్మాళి పోలీస్ లు” అనే లెటర్ హెడ్ తో పాటు సినిమా కంటెంట్ ను ఎలివేట్ చేసే థీమ్ ఈ పోస్టర్ లో ఉంది. బ్యాలెట్ పేపర్ ద్వారా పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ తో పాటు చట్టానికి సింబల్స్ గా ఉన్న మూడు సింహాల బొమ్మను గొలుసులతో కట్టేస్తున్నారు అనే థీమ్ అదిరిపోయింది. అంటే ఆ గొలుసులను తెంపుకుని చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ కోట బొమ్మాళి పోలీస్ లపై ఉందన్నమాట.తెలుగులో తేజ మార్ని డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని బన్నీబాస్ – విద్య కొప్పినీడు నిర్మిస్తున్నారు. మరి తెలుగులో ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related Posts