పరిణీతి పెళ్లైపోయింది

బాలీవుడ్ లవ్ కపుల్ అనగానేఇద్దరూ సేమ్ ప్రొఫెషన్ అనేది కామన్ అయింది. ఆ రొటీన్ ను బ్రేక్ చేస్తూ బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ పొలిటీషియన్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లుగా లవ్ బర్డ్స్ గా ఉన్న ఈ కపుల్ తాజాగా పెళ్లితో ఒక్కటైంది.

ఈ పెళ్లికి అతి తక్కువమంది గెస్ట్ లను మాత్రమే ఇన్వైట్ చేశారు. వారి ఫోన్స్ కు కూడా ఓ కండీషన్ పెట్టారు. ఓ నీలి రంగు కవర్ తొడిగారు. తమ పెళ్లి ఫోటోస్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అఫ్‌ కోర్స్ ఇలాంటి సందర్భాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని దాగవు. దీంతో వాళ్లే స్వయంగా కొన్ని ఫోటోస్ ను బయటకు విడుదల చేశారు.


2011లో లేడీస్ వర్సెస్ రిక్కీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది పరిణీతి చోప్రా. అప్పటికే ఆమె అక్కడ ప్రియాంక చోప్రా బాలీవుడ్ టాప్ హీరోయిన్. అక్క బాటలో వచ్చిన తను అంత పెద్ద స్టార్ కాలేకపోయింది కానీ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్డమ్ తెచ్చుకుంది. అన్ని రకాల పాత్రల్లోనూ ఆకట్టుకుంది. కొన్నాళ్ల క్రితం ఆమె రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉంది.


రాఘవ్ చద్దా యంగ్ అండ్ హ్యాండ్సమ్ పొలిటీషియన్. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్య సభ సభ్యుడుగా నామినేట్ అయ్యాడు. ప్రస్తుతం ఎమ్.పిగానే ఉన్న అతనితో పరిణీతి ప్రేమలో పడటానికి కారణం.. రాఘవ్ అంకుల్ ఓ ఫ్యాషన్ డిజైనర్ కావడం.. అతను పరిణీతి చిత్రాలకు పనిచేసి ఉండటమే అనేది బాలీవుడ్ టాక్. మొత్తంగా ప్రేమలో ఉన్నప్పుడు బాలీవుడ్ కపుల్ చేసే అతి, హడావిడీ వీరేం చేయలేదు. కామ్ గా హ్యాపీగా పెళ్లితో ఒక్కటైన ఈ కపుల్ కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పేద్దాం..

Related Posts