శతృవు ఎవరో తెలియకుండా ఆయుధం తీయకూడదు

నీ శతృవు ఎవరో తెలిస్తేనే నీ బలమెంత అనేది తెలుస్తుంది. నీ అసలు రూపంచూపించు.. నీ శతృవు ఎవరో చెబుతాను.. ఇవీ రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన ధృవ సినిమాలోని ప్రధామైన డైలాగ్స్. అఫ్‌ కోర్స్ ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నా.. కథ ఈ రెండు డైలాగ్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

ఆ సీక్వెల్ లోని డైలాగే ఇది.. ” శతృవు ఎవరో తెలియకుండా ఆయుధం తీయకూడదు.. ” ఇదీ డైలాగ్. అంటే శతృవు ఎంత పెద్దవాడో తెలిస్తే దాన్ని బట్టే ఆయుధం వాడాలి అనేది హీరో మిత్రన్ ఆలోచన. సడెన్ గా హీరో మిత్రన్ ఎవరూ అనిపిస్తోంది కదూ.. యస్.. ఈ మూవీకి సీక్వెల్ వస్తుంది. కానీ తెలుగులో కాదు.

దాని ఒరిజినల్ అయిన తమిళ్ లో. తమిళ్ లో ‘తనీ ఒరువన్’ అనే టైటిల్ తో 2015లో జయం రవి, నయనతార, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి జయం రవి అన్న మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో అచ్చంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ధృవ పేరుతో మక్కీకి మక్కీ రీమేక్ చేసి ఇక్కడా సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే గేమ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. సినిమా కంటెంట్ కూడా బలమైనదే.


ఇక ఇప్పుడీ తనీ ఒరువన్ కు సీక్వెల్ మొదలుపెట్టారీ అన్నదమ్ములు. ఈ మేరకు ఒక వీడియో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. లేటెస్ట్ గా చెన్నైలో తనీ ఒరువన్ సినిమా షో వేశారు. ఆ తర్వాతే ఈ వీడియోను కూడా ప్రదర్శించి సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. ఈ వీడియో చూస్తే దర్శకుడు మోహన్ రాజా ల్యాప్ టాప్ పై వర్క్ చేసుకుంటూ ఒక్కో సీన్ అనుకుంటుంటాడు.

ఆ సీన్ లోని హీరో మిత్రన్( తనీ ఒరువన్ లో హీరో పేరు ఇదే) వస్తాడు. తను రాసే దాన్ని బట్టి ఒక గన్ తీసుకుంటాడు. ఇతను రాసింది చెరిపేసి పెద్ద గన్ అని రాస్తాడు. అతనూ ఆ పిస్టల్ ను అక్కడ పెట్టి పెద్ద గన్ తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ చెరిపేసి.. నిజమైన హీరో శతృవు ఎవరో తెలియకుండా ఆయుధాన్ని తీయడు అనే డైలాగ్ టైప్ చేస్తాడు. మరి ఆ శతృవు ఎవరూ.. అంటే అప్పుడు హీరో డైలాగ్ గా.. ” మన శతృవును మనమే వెదుక్కోవాలి” అనే లైన్ టైప్ చేశాడు. మొత్తంగా సీక్వెల్ అనౌన్స్ మెంట్ కూడా క్రియేటివ్ గా ఎఫెక్టివ్ గా ఉంది. మరి ఫస్ట్ పార్ట్ లో అరవింద్ స్వామి విలనీ అతని కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకుంది. మరి ఈ సారి ఆ ఛాన్స్ ఎవరు కొడతారో చూడాలి.

Related Posts