పూజాహెగ్డే కాదు.. మృణాల్ ఠాకూర్

ఒక సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. ముందుగా అనుకున్న ఆర్టిస్టులు మారొచ్చు. అసలు ఊసులోనే లేనివాళ్లు రావొచ్చు. ఇప్పుడు అదే జరిగింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంది. అతని సినిమాలు వరుసగా పోతున్నా.. ఆ క్రేజ్ తగ్గడం లేదు. అందుకే నిర్మాతలూ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆల్రెడీ అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టి తర్వాత ఒప్పుకున్న దిల్ రాజు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తనకు గీత గోవిందం వంటి బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ డైరెక్షన్ లో ఈ చిత్రం రాబోతోంది. ముందుగా ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తుంది అనుకున్నారు. బట్ రీసెంట్ గా తనకు హ్యాండ్ ఇచ్చి పూజాహెగ్డేను కన్ఫార్మ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు పూజాను కూడా కాదని సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.


ఫస్ట్ మూవీ సీతారామంతోనే బెస్ట్ ఇంపాక్ట్ వేసింది మృణాల్ ఠాకూర్. ఆ టైమ్ లోనే చాలా ఆఫర్స్ వచ్చినా అమ్మడు సెలెక్టివ్ గా వెళుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం నాని 30వ సినిమాలో తనే హీరోయిన్. అయితే తను ఇంకా విజయ్ దేవరకొండ సినిమాకు అఫీషియల్ గా సంతకం పెట్టలేదు కానీ.. టాలీవుడ్ నుంచి తనే హీరోయిన్ అని బలంగా వినిపిస్తోంది.

దీనికి తోడు విజయ్ తో వర్క్ చేయబోతున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉందని చెబుతోంది ఈ హాట్ లేడీ. మొత్తంగా సంప్రదాయంగానూ, హాట్ గానూ కనిపించే�