యానిమల్ కి బీస్ట్ కలర్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్టర్ గా బాలీవుడ్ ను కూడా ఇంప్రెస్ చేశాడు. ఇదే చిత్రాన్ని అక్కడ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అంతా తన వెంట పడేలా చేసుకున్నాడు. ఆ క్రమంలో వస్తోన్న చిత్రమే యానిమల్. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే తమ సినిమాలో ఓ రేంజ్ వయొలెన్స్ ఉంటుందని చెప్పకనే చెప్పాడు సందీప్. ఇక లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ కోసం అనౌన్స్ చేయడానికి ఓ ప్రోమో వదిలాడు. ఈ ప్రోమో చూస్తే ఇతను యానిమల్ కాదు.. బీస్ట్ అనేలా ఉన్నాడు.


రణ్‌బీర్ కపూర్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. అయినా ఏ పాత్రలో అయినా ఒదిగిపోతాడు అనే టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ నే ఈ యానిమల్ లో కూడాచూపించాడు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఓ పెద్ద హోటెల్ లో ముసుగులు వేసుకుని ఆయుధాలు పట్టుకుని పదుల సంఖ్యలో ఉన్న మనుషుల మధ్యలోకి గొడ్డలి పట్టుకుని తనే వెళ్లి ఒక్కొక్కరినీ నరికేస్తుంటాడు రణ్బీర్. ఇది చూస్తుంటే.. ఫస్ట్ మూవీలో థిక్ లవ్ ను చూపించిన సందీప్ ఈ సినిమాలో స్ట్రాంగ్ వయొలెన్స్ తో వస్తున్నాడని అర్థం అవుతుంది.

మొత్తంగా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రాబోతోన్న ఈ మూవీలో రణ్‌బీర్ ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపిస్తాడనీ.. అతని తండ్రి మాఫియా డాన్ అని.. అతన్ని ప్రత్యర్థులు చంపేస్తే.. వారిపై పగ తీర్చుకునేందుకు క్లాస్ రూమ్ వదిలి వార్ రూమ్ లోకి ఎంటర్ అవుతాడని ఈ మూవీ గురించిన కొన్ని కథనాలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ యానిమల్ ప్రోమో చూస్తే బీస్ట్ మోడ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

Related Posts