డిసెంబర్ వార్ లోకి నితిన్

క్రిస్మస్ సీజన్ కు ఒకప్పుడు టాలీవుడ్ పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేది కాదు. దీంతో చిన్న సినిమాలు ఎక్కువగా ఆ టైమ్ లో విడుదలయ్యేవి. కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ మారింది. ఏ చిన్న ఫెస్టివల్ ను కూడా మిస్ చేసుకోవడం లేదు టాలీవుడ్. వరుసగా ప్రతి పండక్కీ పెద్ద హీరోలు వస్తున్నారు.ఈ యేడాది సమ్మర్ వంటి బిగ్ సీజన్ ను మిస్ చేసుకున్న టాప్ స్టార్స్.. బ్రో మూవీ నుంచి వరుసగా వాళ్లు వచ్చిందే పండగ అన్నట్టు రాబోతున్నారు.

ఇక డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా చాలా పెద్ద పోటీ ఉందిప్పుడు.ఆ టైమ్ కు ఇన్ని సినిమాలు ఈ మధ్య తక్కువగా చూస్తున్నాం. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 21న విడుదల కాబోతోంది.

ఆ తర్వాతి రోజు 22న వెంకటేష్ హీరోగా నటిస్తోన్న సైంధవ్ రాబోతోంది.ఇది వెంకీకి 75వ సినిమా కావడం విశేషం. హిట్ మూవీస్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది.

వెంకటేష్ తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.


డిసెంబర్ 22నే సుధీర్ బాబు హీరోగా రూపొందుతోన్న హరోంహర సినిమా విడుదల కాబోతోంది.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.

వీరితో పాటు పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందుతోనన ‘ఓ.జి’సినిమాను కూడా క్రిస్మస్ సందర్భంగానే డిసెంబర్ 21న విడుదల చేస్తారు అనే టాక్ ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి నితిన్ కూడా చేరబోతున్నాడు అంటున్నారు.


వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తోన్న సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్” అనే టైటిల్ తో రాబోతోన్న ఈ మూవీకోసం స్వయంగా రైటర్ కూడా అయిన వక్కంతం వంశీ ఇంకా చాలామంది రచయితల సాయం తీసుకున్నాడు. కిక్ మూవీ తరహా ట్రీట్మెంట్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్23న విడుదల చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరి అన్నీ కుదిరితే ఆ టైమ్ కు వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఇంత పోటీ ఉంటే ఆడియన్స్ కు పండగే కానీ.. వీరికి మాత్రం ఎఫెక్ట్ పడుతుందేమో.

Related Posts