భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నితిన్ ‘తమ్ముడు’

యూత్ స్టార్ నితిన్ కి ఇప్పుడొక హిట్ కావాలి. గత చిత్రం ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అప్‌కమింగ్ మూవీస్ పైనే తన ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం నితిన్ నుంచి వస్తోన్న ‘రాబిన్‌హుడ్, తమ్ముడు’ చిత్రాలు వేటికవే విభిన్నమైనవి. అలాగే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి.

వెంకీ కుడుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రాబిన్‌హుడ్’ చివరిదశకు చేరుకుంది. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘తమ్ముడు’ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ‘తమ్ముడు’ మూవీలోని ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం దాదాపు రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. 10 రోజుల పాటు చిత్రీకరించే ఈ సీక్వెన్స్ సమ్‌థింగ్ స్పెషల్ గా నిలవనుందట.

‘తమ్ముడు’ మూవీలో నిన్నటితరం తార లయ నటిస్తుంది. నితిన్ కి అక్క పాత్రలో లయ కనిపించబోతుంది. ఇక.. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ నితిన్ కి జోడీగా నటిస్తుండగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే.. ‘తమ్ముడు’ విడుదలపై క్లారిటీ ఇవ్వనుందట టీమ్. మరి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘తమ్ముడు’ ఎలాంటి విజయాన్ని సాధించిందో.. ఇప్పుడు ఆయన అభిమాని నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ కూడా అంతటి భారీ విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.

Related Posts