సామజవరగమనా కు సాయం చేసిన కొత్త సినిమాలు

సామజవరగమనా .. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. గత నెల 29న విడుదలైన ఈ మూవీకి సాలిడ్ హిట్ అనే టాక్ వచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా.. చూసిన ప్రతి ఒక్కరినీ నవ్వుల్లో ముంచేస్తూ.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

సమ్మర్ తర్వాత ఇంత పెద్ద హిట్ అనే టాక్ తెచ్చుకున్న ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. రిలీజ్ డే నుంచి రెగ్యులర్ గా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.

మినిమం బడ్జెట్ లోనే తెరకెక్కిన ఈమూవీకి ఏడు రోజుల్లోనే 30 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఓవర్శీస్ లో ఇలాంటి సినిమాలను ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నవాళ్లకు షాక్ ఇస్తూ అక్కడ ఆల్రెడీ హాఫ్‌ మిలియన్ క్లబ్ లోకిఎంటర్ అయ్యి.. మిలియన్ డాలర్ క్లబ్ వైపు దూసుకుపోతోంది.

అయితే సామజవరగమనా దూకుడుకు ఈ శుక్రవారం వచ్చిన సినిమాలు బ్రేక్ వేస్తాయి అనుకున్నారు చాలామంది. అందుకు కారణం అందులో మూడు సినిమాల కంటెంట్ ఎంటర్టైన్మెంట్ తోనే కనిపించడం. బట్ అవేవీ అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రంగబలి ట్రైలర్ చూశాక సామజవరగమనాకు సమస్య తప్పదు అనుకున్నారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌ వరకూ అలాగే అనుకున్నారు జనం. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకే సడెన్ గా పడిపోయింది సినిమా. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ ఏ దశలోనూ లేవలేదు. ఇక మిగతా సినిమాల సంగతి సరేసరి.


మొత్తంగా ఈ వారం దాదాపు ఆరేడు సినిమాలు విడుదలైతే.. వాటిలో ఒక్కటి కూడా హిట్ టాక్ కాదు కదా.. అబౌ యావరేజ్ అన్న టాక్ కూడా తెచ్చుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు సామజవరగమనాకు మరింత ప్లస్ అయింది. ఈ చిత్రానికి ఇంకా ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నా�