కేరళ అందాలతో వస్తోన్న ‘నరుడి బ్రతుకు నటన‘

తెలుగులో వరుస సినిమాలతో దూకుడుమీదున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోతున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన‘. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రిషికేశ్వర్ యోగి తెరకెక్కించిన ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. వివేక్ కూఛిబొట్ల గారు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది ‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రం. ఈ మూవీ షూటింగ్ అంతా కేరళలో పూర్తిచేశారట. తాజాగా.. ‘నరుడి బ్రతుకు నటన‘ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. కేరళలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

Related Posts