రజినీకాంత్ తో నాని

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ గా వస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతోంది.లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో జైలర్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎలాంటి సినిమాను ఎక్స్ పెక్ట్ చేస్తారో ఆ అంశాలన్నీ ఈ మూవీలో ఉన్నట్టు కనిపిస్తోంది.

నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. జాకీష్రాఫ్, వినాయకన్ విలన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, సునిల్ కీలక పాత్రలు చేస్తుండగా తమన్నా పాత్రేంటనేది క్లారిటీ లేదు.

ఇక ఈమూవీ తర్వాత సూపర్ స్టార్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. ఇంతకు ముందు సూర్యతో జైభీమ్ అనే సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టిజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు.
ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు తెలుగు నేచురల్ స్టార్ నాని కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టు టాక్.

ఇంతకు ముందు ఈ విషయంపై కొన్ని వార్తలు వచ్చాయి. అందరూ అవి రూమర్స్ అనుకున్నారు. బట్ నిజమేనట. నాని కూడా ఈ మూవీలో ఓ పాత్ర చేస్తున్నట్టు చెబుతున్నారు. మొదట కేమియో అనుకున్నారు.కేమియోకు మించి ఈ పాత్ర ఉంటుందనేది లేటెస్ట్ టాక్.ఈ పాత్ర సినిమాలో కీలకంగానే ఉంటుందంటున్నారు.ఇదే సినిమాలో రజినీకాంత్ తో పాటు దాదాపు పాతికేళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండటం విశేషం.


ఇక మరోవైపు రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తయ్యాక టిజే జ్ఞానవేల్ సినిమా స్టార్ట్ అవుతుందంటున్నారు.మొత్తంగా నానికి ఈ పాత్ర వల్ల వచ్చేదేం ఉండదు కానీ.. ఇద్దరు లెజెండ్స్ ఉన్న సినిమాలో నటిస్తున్నాను అనే సంతృప్తి మాత్రం ఓ తీపి జ్ఞాపకంగా ఉంటుంది.

Related Posts