నాగ చైతన్యకు ఇద్దరు హీరోయిన్లు

అక్కినేని నాగ చైతన్య వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు. వీటిలో ముందుగా చందు మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మించే సినిమా స్టార్ట్ అవుతుంది. శ్రీకాకుళంలోని కొందరు మత్స్యకారుల నిజ జీవితాల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందబోతోంది. తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా ఉంటుంది.

అటపై సామజవరగమనా దర్శకుడితోనూ మరో ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ ఉంది. ప్రస్తుతం ఆ కథ రెడీ అవుతుంది. ఇక చందు మొండేటి సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలనుకుంటున్నారు. వీరిలో ఒకరు చైతూతో ఫ్రెష్ కాంబో అయితే మరొకరు ఆల్రెడీ ఒక సినిమా చేసిన బ్యూటీ ఉన్నారు.


ముందు నుంచీ చైతన్య, చందు సినిమా కోసం కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అఫీషియల్ గా చెప్పడం లేదు కానీ.. తను ఆల్మోస్ట్ ఓకే అయిందని టాక్. ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా కలిసి నటించలేదు. అందుకే ఈ కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుంది.

పైగా ఈ కథకు బలమైన నటీనటులు కావాలి. అందుకు కీర్తి అయితే మంచి ఛాయిస్ అవుతుంది. ఇక తనతో పాటు మరో ఫీమేల్ లీడ్ కూ స్పేస్ ఉందట. ఆ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి, చైతన్య కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ మంచి విజయం సాధించింది. వీరి మధ్య మంచి రాపో కూడా ఉందని టాక్ ఉంది.

ఆ రాపో ఈ సినిమాకూ ప్లస్ అవుతుంది. అయితే సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుందా లేక ఇంకేదైనా ఇంపార్టెంట్ రోల్ చేయబోతుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చైతన్యతో పాటు ఇద్దరు టాలెంటెడ్ హీరోయిన్లు నటిస్తారనే వార్తలు మాత్రమే వస్తున్నాయి కానీ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ అయినా.. అఫీషియల్ గా ప్రకటించలేదు

Related Posts