‘మిస్టర్ బచ్చన్‘ అప్డేట్.. జూన్ 17న రానున్న షో రీల్

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్, లక్నో వంటి ప్రదేశాల్లో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా.. హైదరబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఇక.. ‘మిస్టర్ బచ్చన్‘ చివరిదశకు చేరుకోవడంతో మూవీ అప్డేట్స్ కోసం మాస్ మహారాజ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈకోవలోనే.. ఫ్యాన్స్ కోసం ‘మిస్టర్ బచ్చన్‘ నుంచి ఓ షో రీల్ ను రిలీజ్ చేయబోతున్నారట. అది కూడా డైలాగ్స్ లేకుండా.

డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజా ఫ్యాన్ కి ‘మిస్టర్ బచ్చన్‘ షో రీల్ అప్డేట్ గురించి వివరిస్తూ సాగే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. జూన్ 17న ‘మిస్టర్ బచ్చన్‘ షో రీల్ రిలీజ్ కాబోతుంది.

Related Posts