రవితేజ మాస్ స్వాగ్ తో ‘మిస్టర్ బచ్చన్‘ షో రీల్

మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్‘. రవితేజ నటించిన ‘షాక్‘ సినిమాతో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు హరీష్ శంకర్. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మిరపకాయ్‘ మంచి విజయాన్ని సాధించింది. ఇక.. పుష్కర కాలం తర్వాత మళ్లీ రవితేజ-హరీష్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్‘ తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో రవితేజాకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్‘కి రీమేక్. ఈ సినిమాలో ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఓ పొలిటీషియన్ ఇంట్లో ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ కి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా.. ఈ సినిమా నుంచి షో రీల్ పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీమ్.

https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak

ఈ షో రీల్ లో ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో రవితేజ తనదైన మాస్ అవతార్ లో రెచ్చిపోతున్నాడు. విలన్ పాత్రలో జగపతిబాబు ఎంతో విలక్షణంగా కనిపిస్తున్నాడు. మిక్కీ జె.మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే.. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Related Posts