బిజీగా మారుతోన్న ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ

కొంతమంది తారలు తొలి సినిమా విడుదల కాకుండానే వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆకోవలోకే వస్తోంది పూణె బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. అంతకుముందు బాలీవుడ్ లో ‘యారియానా 2’లో మెరిసిన భాగ్యశ్రీని.. ఏరికోరి ‘మిస్టర్ బచ్చన్’ కోసం ఎంచుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజకి జోడీగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ తో కుర్రాకారుకి హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. భాగ్యశ్రీ.

‘మిస్టర్ బచ్చన్’ విడుదలకాకుండానే ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుందట. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి చిత్రం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలుత శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకుంది. ఆ స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

ఇక.. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించే సినిమాలోనూ భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంపికైందట. నానితో ‘దసరా’ చిత్రాన్ని నిర్మించిన ఎస్.ఎల్.వి. సినిమాస్ ఈ మూవీని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే.. భాగ్యశ్రీ నటించే అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రానున్నాయట.

Related Posts