రొమాంటిక్ మోడ్ లోకి మారుతోన్న మెగా ప్రిన్స్

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. ఈమధ్య వరుసగా ప్రయోగాత్మక సినిమాలతో విసిగిపోయిన వరుణ్ తేజ్.. ఇప్పుడు మళ్లీ రొమాంటిక్ మోడ్ లోకి మారబోతున్నాడట. గతంలో వరుణ్ తేజ్ నటించిన లవ్ స్టోరీస్ ‘కంచె, ఫిదా, తొలిప్రేమ’ మంచి విజయాలు సాధించాయి.

అయితే.. ఎంతో ప్రయోగాత్మకంగా చేసిన ‘అంతరిక్షం, గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈనేపథ్యంలోనే.. మళ్లీ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని డిసైడయ్యాడట. ‘టచ్ చేసి చూడు’ సినిమా డైరెక్టర్ విక్రమ్ సిరికొండతో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరుణకుమార్ దర్శకత్వంలో పీరియడ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts