మాస్ రాజా మల్టీస్టారర్

మాస్ మహరాజ్ రవితేజకు స్టార్డమ్ వచ్చిన దగ్గర్నుంచీ దూకుడుగానే ఉన్నాడు. వరుస మూవీస్ తో దూసుకుపోతున్నాడు. యేడాదికి కనీసం రెండు సినిమాలైనా విడుదల చేస్తూ వస్తున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ మూవీస్ వచ్చాయి. మరోటి దసరాకు రాబోతోంది. నెక్ట్స్ ఇయర్ కూడా మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. .

అందులో ఫస్ట్ మూవీ ఈగిల్ సంక్రాంతికి విడుదల కాబోతోంది. తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ ను తెలుగులో హరీష్‌ శంకర్ తో రీమేక్ చేయబోతున్నాడు. మరో సినిమా మల్టీస్టారర్ గా రాబోతోంది. అయితే ఈ మూవీ విక్రమ్ వేదాకు రీమేక్ అన్నారు. బట్ కాదు.. ఫ్రెష్ స్టోరీనే వస్తుందట. ఈ చిత్రంలో రవితేజతో పాటు విశ్వక్ సేన్ కూడా మరో హీరోగా నటించబోతున్నాడు.ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకుడు.


కలర్ ఫోటో చిత్రంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్. బట్ రెండో సినిమా కోసం చాలాకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. బట్ లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఏకంగా మాస్ మహరాజ్ తోనే సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఆయనకు కథ చెప్పి ఒకే చేయించుకున్న తర్వాతే విశ్వక్ సేన్ ను ఒప్పించాడంటున్నారు. అలాగే ఈ మూవీలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే.. మంచు మనోజ్ కూడా నటిస్తున్నాడు. అతను విలన్ గాకనిపిస్తాడు అంటున్నారు. కానీ కాదు.. ఇదో కంప్లీట్ మల్టీస్టారర్ అనే మాటలూ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మేల్ కాస్టింగ్ తోనే క్రేజీ అనిపించుకుంటోందీ చిత్రం.

Related Posts