మ్యాజిక్ చూపని ‘మామా మశ్చీంద్ర‘

ఘట్టమనేని అల్లుగా అరంగేట్రం చేసినా అనతి కాలంలోనే తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ ను సెట్ చేసుకున్నాడు సుధీర్ బాబు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రయోగాలకు కూడా పెద్ద పీట వేసే సుధీర్ తాజాగా ‘మామా మశ్చీంద్ర‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు త్రిపాత్రాభినయంతో నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రచార చిత్రాలతో ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రంగా ‘మామా మశ్చీంద్ర‘పై మంచి బజ్ ఏర్పడింది.

సుధీర్ బాబు కి జోడీగా ఈషారెబ్బా, మృణాళిని రవి నటించిన ఈ సినిమాలో అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, మిర్చి కిరణ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పీ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహనరావు లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈరోజు విడుదలైన చిత్రాలలో ‘మామా మశ్చీంద్ర‘ సినిమానే మంచి స్టార్ వేల్యూ ఉన్న మూవీ. దాంతో ఈ సినిమాకోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగానే సాగాయి. ఇక సినిమా విషయానికొస్తే మంచి అంచనాలతో వచ్చిన ‘మామా మశ్చీంద్ర‘ సినిమా ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచిందనే రివ్యూస్ వస్తున్నాయి.

పెద్ద వయసున్న పరశురామ్ పాత్రలోనూ.. డీజే, దుర్గ లుగా కవల పాత్రల్లోనూ సుధీర్ త్రిపాత్రాభినయం చేశాడు. అయితే వీటిలో పెద్ద పాత్రైన పరశురామ్ రోల్ సుధీర్ కి ఏమాత్రం సూట్ అవ్వలేదనే విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద పాత్రలో సుధీర్ గడ్డం, విగ్గు లు బాగాలేదనేది ప్రధాన విమర్శ. అలాగే కవల సోదరుల్లో చబ్బీగా కనిపించే దుర్గ పాత్ర మేకప్ నాసిరకంగా ఉన్నట్టు కనిపిస్తుందనే విమర్శలూ వస్తున్నాయి.

కథ, కథనాల విషయంలో దర్శకుడు గందరగోళానికి గురయ్యాడనేది సినిమా చూసిన వాళ్ల మాట. నటుడు, రచయితగా మంచి అనుభవమున్న హర్షవర్ధన్.. తాను రాసుకున్న సంక్లిష్ట స్క్రీన్ ప్లే ను ఆన్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడనే రివ్యూస్ వస్తున్నాయి. ఇక.. ఫస్టాఫ్ లో క్యారెక్టర్స్ మధ్య రిలేషన్స్ విషయంలో కన్ఫ్యూషన్.. సెకండాఫ్ లో లీడ్ రోల్స్ మధ్య లవ్ ట్రాక్ విషయంలో లేని క్లారిటీ వంటివి సినిమాకి మైనస్ గా మారాయంటున్నారు.

Related Posts