సితార సంస్థలో మహేష్ మేనల్లుడి సినిమా

ఒకవైపు అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు యంగ్ హీరోస్ కి అదిరిపోయే హిట్స్ అందిస్తుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. అందుకే.. సితార సంస్థలో సినిమా చేయడానికి యువ కథానాయకులు పోటీ పడుతున్నారు. ఈ లిస్టులో గల్లా వారబ్బాయి అశోక్ కూడా చేరాడు. సితార బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.27గా రూపొందే సినిమాలో అశోక్ గల్లా హీరోగా నటించబోతున్నాడు. ఈరోజు (ఏప్రిల్ 5) అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేశారు.

‘ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ‘తో కూడిన పోస్టర్ తో ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడం విశేషం. ఈ సినిమాలో ‘మ్యాడ్‘ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. ఉద్భవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారట.

అశోక్ గల్లా బర్త్ డే స్పెషల్ గా అతని మరో చిత్రం ‘దేవకి నందన వాసుదేవ‘ నుంచి ‘ఏమయ్యిందే‘ అంటూ సాంగే సాంగ్ ప్రోమో రిలీజయ్యింది. భీమ్స్ సిసిరోలియో సంగీతంలో సురేష్ గంగుల రాసిన ఈ గీతాన్ని ఈశ్వర్ దత్తు ఆలపించారు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవకి నందన వాసుదేవ‘ సినిమాలో అశోక్ గల్లాకి జోడీగా మానస వారణాసి నటిస్తుంది.

Related Posts