పెద్దోడు చిన్నోడు కంబైన్డ్ గా మల్టీఫ్లెక్స్ కడుతున్నారు..!

‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు‘ చిత్రంలో కలిసి నటించి.. ప్రేక్షకుల మదిలో పెద్దోడు, చిన్నోడు గా చిరకాలం గుర్తండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు వెంకటేష్, మహేష్ బాబు. బయట కూడా రియల్ బ్రదర్స్ లా వ్యవహరించే ఈ పెద్దోడు, చిన్నోడు కలిసి ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో పార్టనర్స్ గా వ్యవహరించబోతున్నారట.

హైదరాబాద్ లో ఒకప్పుడు థియేటర్లకు అడ్డాగా ఉన్న ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్. థియేటర్ ను మల్టీఫ్లెక్స్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘ఎ.ఎమ్.బి. విక్టరీ‘ పేరుతో ఏషియన్ ఫిల్మ్స్, మహేష్ బాబు, వెంకటేష్ సంయుక్తంగా ఈ మల్టీఫ్లెక్స్ ను నిర్మిస్తున్నారట. త్వరలోనే.. ‘ఎ.ఎమ్.బి. విక్టరీ‘ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు.. ఏషియన్ తో కలిసి ‘ఎ.ఎమ్.బి, ఎ.ఎమ్.బి క్లాసిక్స్‘ను తీసుకొచ్చాడు.

మరోవైపు.. ఏషియన్ సంస్థ టాలీవుడ్ బడా స్టార్స్ అందరినీ ఒక్కొక్కరిగా థియేటర్ల బిజినెస్ లోకి లాక్కొస్తుంది. ఈ కోవలోనే అల్లు అర్జున్ తో అమీర్ పేటలో ‘ఎ.ఎ.ఎ‘, విజయ్ దేవరకొండతో మహబూబ్ నగర్ లో ‘ఎ.వి.డి.‘ రవితేజాతో దిల్ షుఖ్ నగర్ లో ‘ఎ.ఆర్.టి‘ వంటి మల్టీఫ్లెక్స్ ను తీసుకొచ్చింది. ఇంకా.. ప్రభాస్, నాని వంటి స్టార్స్ తోనూ త్వరలో మల్టీఫ్లెక్స్ ను నిర్మించే సన్నాహాల్లో ఉందట ఏషియన్ సంస్థ.

Related Posts